బాలయ్య అభిమానులకు షాక్.. అఖండ 2 ప్రీమియర్స్ రద్దు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తోన్న నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుండగా.. డిసెంబర్ 4న అఖండ 2 ప్రీమియర్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుమతులు మంజూరు చేశాయి. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్ రద్దు అయ్యాయి. టెక్నికల్ కారణాలతో ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా... 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. ఆది పినిశెట్టి విలన్‌గా, బజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలకపాత్ర పోషిస్తున్నారు.
అలాగే కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నారు.. తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.


Comments
Post a Comment